: యూపీలో 'బాజీరావ్ మస్తానీ'కి పన్ను మినహాయింపు
గతంలో పలు బాలీవుడ్ చిత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, తాజా హిట్ సినిమా 'బాజీరావ్ మస్తానీ'కి కూడా పన్ను మినహాయింపు ప్రకటించింది. ఇటీవల ఈ చిత్రాన్ని ఆ రాష్ట్ర సీఎం అఖిలేశ్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలసి వీక్షించారు. ఈ చిత్రం ఆయనను బాగా ఆకట్టుకుందట. దాంతో సినిమాకు పన్ను రద్దు చేస్తున్నట్టు అఖిలేశ్ స్వయంగా ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 18న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కాసుల వర్షం కురిపిస్తోంది. రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రాల నటన, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది.