: పెషావర్ లో ఆత్మాహుతి దాడి.. 8 మంది దుర్మరణం
ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్ కూడా ముష్కరుల మెరుపు దాడులకు భీతిల్లుతోంది. ఇప్పటికే పాక్ లోని ప్రధాన నగరాల్లో బాంబులతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో జనాన్ని పొట్టనబెట్టుకున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం పాక్ లోని పెషావర్ లో జనంతో రద్దీగా ఉన్న మార్కెట్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అక్కడికక్కడే 8 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.