: రోహిత్ కుటుంబ సభ్యులకు ఫోన్ లో జగన్ పరామర్శ


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. వారికి ఫోన్ చేసి ఓదార్చారు. వర్సిటీలో చోటుచేసుకున్న ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన పరిణామాల గురించి రోహిత్ తల్లిని అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News