: 'క్యాష్ కరో' అంటున్న రతన్ టాటా!
ఇటీవలి కాలంలో స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ, ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్న పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, తాజాగా ఆన్ లైన్ క్యాష్ బ్యాక్ వెంచర్ 'క్యాష్ కరో డాట్ కాం'లో పెట్టుబడులు పెట్టారు. గుర్ గాం కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ గత నవంబరులో రూ. 25 కోట్ల నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. ఆపై రతన్ టాటా సైతం సంస్థ ఆలోచనలకు, నడుస్తున్న విధానాన్ని చూసి ఆకర్షితుడై మంచి భవిష్యత్తుతో పాటు పెట్టుబడికి అధిక రాబడి వుంటుందని నమ్మి ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఎంత మొత్తాన్ని ఆయన పెట్టుబడిగా పెట్టారన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ సంస్థను లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో చదువుకున్న స్వాతి, రోహన్ భార్గవలు స్థాపించారు.