: రిఫండ్స్ ఆలస్యమైతే 12 శాతం వడ్డీ కలిపి ఇవ్వనున్న ఆదాయపు పన్ను శాఖ!


ఆదాయపు పన్ను చెల్లింపుల అనంతరం రిఫండ్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడక్కర్లేదు. ఐటీ విభాగంలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేలా ఏర్పాటు చేసిన కమిటీ కీలక సిఫార్సులు చేసింది. మాజీ న్యాయమూర్తి ఆర్వీ ఈశ్వర్ నేతత్వంలో ఏర్పడ్డ కమిటీ, రిఫండ్స్ ఆలస్యమైతే 12 శాతం వడ్డీని పన్ను చెల్లింపుదారుడికి ఇవ్వాలని సిఫార్సు చేసింది. దీనివల్ల అధికారుల్లో సైతం జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడింది. ఐటీ రిటర్నుల ప్రాసెసింగ్ లో ఆలస్యం జరిగినా, ఇంతే శాతాన్ని వడ్డీ రూపంలో చెల్లించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని సూచించింది. కాగా, ఈశ్వర్ కమిటీ సూచనలు, సిఫార్సులపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి వుంది.

  • Loading...

More Telugu News