: అండమాన్ దీవులపై చైనా కన్ను, 'పొసైడన్-8ఐ'ని మోహరించిన భారత్


హిందూ మహా సముద్రంలోకి, ముఖ్యంగా అండమాన్, నికోబార్ దీవుల సమీపాలకు తరచూ అణు ఆయుధాలతో నిండిన చైనా సబ్ మెరైన్లు వచ్చి పోతుండటంతో ఆ దేశానికి దీటుగా బదులివ్వాలని ఇండియా నిర్ణయించింది. ఈ మేరకు లాంగ్ రేంజ్ నావల్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ 'పొసైడన్-8ఐ'లతో పాటు గూఢచార మానవ రహిత విమానాలను భారత్ మోహరించింది. గడచిన రెండు వారాలుగా రెండు పొసైడన్ విమానాలు భారత జలాలను కాపు కాస్తున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న యూఏవీ (అన్ మాన్డ్ ఏరియల్ వెహికిల్స్)లనూ మోహరించామని తెలిపారు. వీటిల్లో హార్పాన్ బ్లాక్-2 మిసైళ్లు, ఎంకే-54 తేలికపాటి టోర్పెడోలు, రాకెట్లు తదితరాలు ఎల్లప్పుడూ ప్రయోగానికి సిద్ధంగా ఉంటాయని అధికారి వివరించారు.

  • Loading...

More Telugu News