: 3 నెలల్లో ఆరు ప్రకంపనలు!... నెల్లూరు జిల్లాలో మళ్లీ భూకంపం
ఏపీలోని నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు పరిపాటిగా మారాయి. ఇటీవలి కాలంలో తరచూ ఆ జిల్లాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. గడచిన మూడు నెలల్లోనే ఆ జిల్లాలో ఆరు పర్యాయాలు భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా నేటి ఉదయం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జిల్లాలోని ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు తదిరత ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.