: రాజధాని ఎక్స్ ప్రెస్ లో మహిళ పట్ల జేడీయూ ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన... కేసు నమోదు


బీహార్ లో ప్రజా ప్రతినిధుల తీరు ఏమాత్రం మారలేదు. నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు కేసుల్లోనూ ఇరుక్కుంటున్నారు. తాజాగా రాజధాని ఎక్స్ ప్రెస్ లో మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికార జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలంపై కేసు నమోదైంది. ఆదివారం రాత్రి గువాహటి-రాజధాని ఎక్స్ ప్రెస్ లో చోటుచేసుకున్న ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై బాధితురాలి భర్త రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీహార్ లోని కిషన్ గంజ్ జిల్లా జోకిహట్ నియోజకర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్ఫరాజ్ పై ఐపీసీ సెక్షన్లు 341, 323, 290, 504, 354A కింద పాట్నా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలం... లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలో సీనియర్ నేతగానే కాక, కరుడుగట్టిన బీహారీగా పేరుగాంచిన తస్లీముద్దీన్ కుమారుడు.

  • Loading...

More Telugu News