: తెలుగు రాష్ట్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా మరో మోసం.. ‘సమృద్ధ జీవన్’ అక్రమ వ్యాపారం!


అగ్రిగోల్డ్, పెరల్స్ తరహాలో మరో భారీ స్కాం వెలుగు చూసింది. సమృద్ధ జీవన్ మల్టీ స్టేట్ మల్టీ పర్సస్ కో-ఆపరేటివ్ సొసైటీ భారీ మోసానికి పాల్పడుతూ వినియోగదారులకు శఠగోపం పెడుతోంది. దేశ వ్యాప్తంగా రూ.3 వేల కోట్లు పైగా ఈ సొసైటీ ద్వారా వసూలు చేశారు. ‘సమృద్ధ జీవన్’ అక్రమ వ్యాపారమని సెబీ నిర్ధారించడంతో దేశవ్యాప్తంగా సీబీఐ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కో-ఆపరేటివ్ సొసైటీ ఎండీ మహేష్ కిషన్ మోతేవార్ ను ఒడిశాలో పోలీసులు అరెస్టు చేసి, విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారం సాగుతోంది. కాగా, సమృద్ధ జీవన్ మల్టీ స్టేట్ మల్టీ పర్సస్ కో-ఆపరేటివ్ సొసైటీని 2001లో పూణెలో మోతేవార్ ప్రారంభించారు. అనంతరం 18 రాష్ట్రాల్లో దీనిని విస్తరింపజేశారు. దేశ వ్యాప్తంగా రెండు కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. మోతేవార్ సొంత ఆస్తి సుమారు రూ.26,500 కోట్లు అని కంపెనీకి సంబంధించిన వ్యక్తులు చెబుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు వెయ్యి కోట్లు రూపాయల వరకు వినియోగదారుల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. మేకలు, గొర్రెలు, పాడి గేదెలు కొనుగోలు చేస్తామని, దీంతో పాటు కో-ఆపరేటివ్ సొసైటీ కూడా నిర్వహిస్తామని, ఐదేళ్లలో కట్టిన డబ్బుకు మరింత ఎక్కువ డబ్బుతో తిరిగి ఇస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు. అలాగే, చిట్స్ పేరిట కూడా లక్షల రూపాయలను ఖాతాదారుల నుంచి వసూలు చేశారు.

  • Loading...

More Telugu News