: మధురను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా : హేమమాలిని


శ్రీకృష్ణ భగవానుడి పాద స్పర్శతో పునీతమైన నేల ఉత్తరప్రదేశ్ లోని బ్రజ్ ప్రాంతమని, దీనిని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తాను నడుం బిగించానని బీజేపీ ఎంపీ, అలనాటి అందాల తార హేమమాలిని అన్నారు. దీంతో పాటు రాధాదేవి జన్మించిన రావల్ గ్రామాన్ని తాను దత్తత తీసుకున్నానని ఆమె చెప్పారు. మధుర, రావల్ గ్రామాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే నిమిత్తం పనులు చేపట్టామని అన్నారు. మధుర అభివృద్ధి విషయంలో తాను ప్రత్యేక శ్రద్ధ వహించానని, ఆ ఒక్క ప్రాంతం కోసమే రూ.100 కోట్లు మంజూరయ్యేలా చేశానని పేర్కొన్నారు. మధురలో శ్రీకృష్ణ థీమ్ పార్క్, ఫుడ్ కోర్టు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కంటెయినర్ డిపో పనులు మొదలుపెట్టామన్నారు. బృందావనానికి రాధారాణి రైలును కూడా ప్రారంభిస్తున్నట్లు హేమమాలిని చెప్పారు.

  • Loading...

More Telugu News