: షమి స్థానంలో వర్థమాన ఆటగాడు జాస్ప్రిట్ కు చోటు
ఆస్ట్రేలియాతో జరగనున్న టీట్వంటీ సిరీస్ లో పాల్గొనే టీమిండియా జట్టులో గుజరాత్ ఆటగాడు జాస్ప్రిట్ స్థానం సంపాదించుకున్నాడు. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో గుజరాత్ తరపున బరిలో దిగిన జాస్ప్రిట్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సత్తా చాటి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. దీంతో ఆసీస్ పర్యటన ప్రారంభంలో గాయపడిన మహ్మద్ షమి స్థానంలో టీట్వంటీ సిరీస్ కు జాస్ప్రిట్ ను సెలెక్టర్లు ఆస్ట్రేలియాకు పంపనున్నారు. ఈ మేరకు ఈ నెల 22న ఆసీస్ బయల్దేరనున్న టీమిండియా ఆటగాళ్లు సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్ లతో కలిసి జాస్ప్రిట్ వెళ్లనున్నాడు. సరైన సీమర్ లేక ఇబ్బందులు పడుతున్న టీమిండియా జట్టులో నిలదొక్కుకుంటానని జాస్ప్రిట్ ఆశాభావం వ్యక్తం చేశాడు.