: ఆయనది ఆత్మహత్య అనడానికి ఆధారాలు లేవు: మాజీ జడ్జి మృతిపై తుకారం గేట్ పోలీసులు


మాజీ జడ్జి ప్రభాకరరావుది ఆత్మహత్య లేక అనుమానాస్పద మృతి అనడానికి తగ్గ ఆధారాలు లభించలేదని తుకారం గేట్ పోలీసులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ, ప్రభాకరరావు మృతి అనారోగ్య కారణాల వల్ల సంభవించినదని అన్నారు. కాగా, అనుమానాలకు సమాధానాలు కనుక్కునే ప్రయత్నంలో భాగంగా ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపామని వారు తెలిపారు. కాగా, తన తండ్రి ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనది అనుమానాస్పద మృతి కాదని, దీనిని రాజకీయం చేయవద్దని మాజీ జడ్జి ప్రభాకరరావు కుమారుడు డేవిడ్ ప్రశాంత్ మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, గాలి జనార్దనరెడ్డి బెయిల్ మంజూరు కేసులో ప్రభాకరరావు ప్రస్తుతం బెయిల్ ఉన్నారు.

  • Loading...

More Telugu News