: మీ కడుపున పుట్టడమే నాకు లభించిన వరం: ట్విట్టర్లో బాలయ్య
ఎన్టీఆర్ వారసుడిగా జన్మించడమే ఈ జన్మకు లభించిన వరమని ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన అధికారిక ట్విట్టర్ పేజ్ ద్వారా స్పందించారు. ఎన్టీఆర్ కలలను తాను నిజం చేస్తానని అన్నారు. మరణం లేని జననం ఆయనదని బాలయ్య పేర్కొన్నారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని పేదరికం లేని సమాజానికి బాటలు వేసిన తెలుగు ప్రజల ఆరాధ్యనాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గాథ, బోధ తమకు భగవద్గీత అని ఆయన పేర్కొన్నారు. 'అమరపురి అధినేత, అందుకో మా జ్యోతా' అని ఆయన సోషల్ మీడియా ద్వారా తన తండ్రికి ఘన నివాళి అర్పించారు. దీనికి ఆయన అభిమానుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.