: తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ
జాతీయ స్థాయిలో తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ కు నివాళులర్పించిన సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని టీడీపీని నడుపుతున్నామని ఆయన చెప్పారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని ఆదరణ టీడీపీకి ఉందని ఆయన చెప్పారు. నేడు ఏన్టీఆర్ ట్రస్టు చేపట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని అంతా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.