: 'అన్న'పైనా కేసీఆర్ రాజకీయం: తెదేపా నిప్పులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని సైతం కేసీఆర్ సర్కారు రాజకీయం చేస్తోందని తెదేపా నిప్పులు చెరిగింది. నేడు ఆయన 20వ వర్ధంతని తెలిసి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లనూ కేసీఆర్ ప్రభుత్వం చేయలేదని, కనీసం ఆయన స్మృతి స్థలం వద్ద అలంకరణలనూ చేయలేదని గ్రేటర్ హైదరాబాద్ తెలుగుదేశం అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ విమర్శించారు. ఇది ఓ మహా నాయకుడిని అవమానించినట్టేనని వ్యాఖ్యానించిన ఆయన, మరోసారి ఇలాగే జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.