: మాజీ జడ్జి ప్రభాకర్ రావుది హత్యా? ఆత్మహత్యా?
మాజీ న్యాయమూర్తి ప్రభాకర్ రావు ఈ ఉదయం ఆయన నివాసంలో విగతజీవుడిగా కనిపించడం సంచలనం కలిగించింది. తొలుత ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావించినా, స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న తీరుపై ఎన్నో ప్రశ్నలు ఉన్నట్టు ప్రాథమికంగా విచారణ జరిపిన పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీనిపై లోతుగా దర్యాఫ్తు జరపనున్నట్టు పేర్కొన్నాయి. ఇక ప్రభాకర్ రావు తన జీవితంపై పడ్డ మచ్చతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెవరైనా ఆయన మరణానికి కారకులా? అన్నది తేలాల్సి వుంది. కాగా, గాలి జనార్దనరెడ్డి బెయిల్ కుంభకోణంలో తనకు ప్రమేయం లేదని, తనను అన్యాయంగా ఇరికించారని గత రెండేళ్లుగా ఆయన న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.