: దావోస్ లో తిరుగుతున్న ఏపీ ప్రచార రథం!... ‘మేక్ ఏపీ యువర్ బిజినెస్’ పేరిట సరికొత్త యత్నం


స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో రేపటి నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సులకు హాజరయ్యే నిమిత్తం నేటి రాత్రి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన ప్రతినిధి బృందంతో కలసి దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు. అయితే వారం రోజుల నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఓ బస్సు దావోస్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, అక్కడి ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘మేక్ ఏపీ యువర్ బిజినెస్’ పేరిట సరికొత్తగా రూపొందించిన ఈ బస్సు ఏపీ ప్రభుత్వానికి చెందినదే. ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఏపీ సర్కారు ఈ సరికొత్త యత్నానికి శ్రీకారం చుట్టింది. ఇక ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన హోర్డింగులు కూడా అక్కడి వారిని ఆకట్టుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News