: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీంపై కేసు
సిక్కుల ఆధ్యాత్మిక వేత్త, డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా గుర్మీత్ రాం రహీం విష్ణువు ఆకారం ధరించి భక్తులకు దర్శనమిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆల్ ఇండియా హిందూ స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐహెచ్ఎస్ఎఫ్) సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేరా చీఫ్ గుర్మీత్ సింగ్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.