: హైదరాబాదు శివార్లలో టోల్ గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు
హైదరాబాదు శివార్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద రద్దీ నెలకొంది. సంక్రాంతి సంబరాలు ముగియడంతో నాలుగు రోజుల విరామం తరువాత నగరవాసులు స్వస్థలాల నుంచి హైదరాబాదుకు తరలుతున్నారు. దీంతో హైదరాబాదు శివార్లలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. టోల్ గేట్ల వద్ద వాహనాలను కేవలం పది నుంచి 20 సెకెన్లకో వాహనం చొప్పున క్లియరెన్స్ ఇస్తున్నా రద్దీ తగ్గడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. గంటలతరబడి వాహనాల్లో నిరీక్షించాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. కాగా, హైదరాబాదులో ప్రవేశించేందుకు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే వాహనాలను వరుసల్లో పంపే ఏర్పాట్లు చేశారు. రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే వాహనాలు భారీ ఎత్తున చేరుకుంటుండడంతో టోల్ గేట్ల వద్ద రద్దీ నెలకొందని టోల్ గేట్ సిబ్బంది పేర్కొంటున్నారు.