: ఒత్తిడిని తట్టుకోలేకపోయారు...అందుకే ఓడాం: ధోనీ


టీమిండియా ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకోలేకపోయారని కెప్టెన్ ధోనీ తెలిపాడు. మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో మూడో వన్డేలో ఓటమిపాలైన అనంతరం ధోనీ మాట్లాడుతూ, టీమిండియా బౌలింగ్ విభాగంలో అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనపడిందని అన్నాడు. అద్భుతమైన బౌలింగ్ చేసినప్పటికీ, కీలక సమయాల్లో ఫీల్డింగ్ తప్పిదాలవల్ల నాలుగైదు బౌండరీలు అదనంగా ఇచ్చామని, అవే తమ కొంపముంచాయని ధోనీ పేర్కొన్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసినప్పటికీ ఆస్ట్రేలియా జట్టుపై ఆ ఒత్తిడి అలాగే కొనసాగించలేకపోయామని ధోనీ పేర్కొన్నాడు. సిరీస్ లో ఇప్పటివరకు భారీ సెంచరీలు చేసింది టీమిండియా ఆటగాళ్లేనని గుర్తు చేసిన ధోనీ, కొన్ని తప్పిదాల వల్ల వాటికి విలువలేకుండా పోయిందని చెప్పాడు. తాను కూడా బౌలర్లను వినియోగించుకోవడంలో తడబడ్డానని, సరైన ఫలితాలు రాబట్టలేకపోయానని ధోనీ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News