: బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటామని ఎప్పుడూ చెప్పలేదు: ఫరూఖ్ అబ్దుల్లా
బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటామని తామెప్పుడూ చెప్పలేదని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతానికి తమకు ప్రజల మద్దతు లేదు కనుక ప్రభుత్వ ఏర్పాటు గురించి తామేమీ మాట్లాడలేమని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది బీజేపీ, పీడీపీ అని అన్నారు. ఒకవేళ బీజేపీ నుంచి పొత్తుపై ప్రతిపాదన వస్తే, తమ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. అందుకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్ లో ప్రస్తుతం గవర్నర్ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు షరతులున్నాయంటూ పీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మెహబూబా ముఫ్తీ పేర్కొవడంతో పొత్తులపై ఆ రాష్ట్రంలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.