: స్మిత్, బెయిలీని పెవిలియన్ బాటపట్టించిన జడేజా


మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే ఉత్కంఠ రేపుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు కోహ్లీ (117) సెంచరీతో రాణించడంతో 295 పరుగులు చేసింది. అనంతరం ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 15.5 ఓవర్లలో వంద పరుగుల మార్కు దాటింది. అనంతరం ఉమేష్ యాదవ్ చక్కని బంతితో ఆరోన్ ఫించ్ (21) ను బోల్తా కొట్టించగా, స్టీవ్ స్మిత్ (41), జార్జ్ బెయిలీ (23) లను రవీంద్ర జడేజా పెవిలియన్ బాటపట్టించాడు. అనంతరం షాన్ మార్ష్ (62) ను ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు. దీంతో, నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 30 ఓవర్లలో 167 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో జడేజా రెండు, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరో ఒక వికెట్ తో రాణించారు.

  • Loading...

More Telugu News