: రాష్ట్ర విభజన పాపం రెండు మూడు తరాలు వెంటాడుతుంది: ఆనం వివేకానందరెడ్డి
రాష్ట్ర విభజన పాపం రెండు మూడు తరాల పాటు వెంటాడుతుందని ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల చాలా నష్టపోయామని అన్నారు. క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికవ్వడం అదృష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారని ఆయన కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అమోఘమని, లోకాన్ని చుట్టిన నాయకుడి ఆధ్వర్యంలో పని చేయడం ఆనందకరమని ఆయన పేర్కొన్నాడు. టీడీపీలో క్రమశిక్షణతో చంద్రబాబు చూపిన దారిలో నడుచుకుంటామని ఆయన తెలిపారు.