: ఉద్యోగం కంటే భిక్షాటన వల్లే ఎక్కువ ఆదాయం వస్తోంది: జడ్జితో బిచ్చగాడు


ఉద్యోగంలో చేరడం కన్నా బిచ్చం ఎత్తుకోవడం వల్లే ఎక్కువ ఆదాయం వస్తోందని ఓ బిచ్చగాడు జడ్జితో చెప్పిన ఘటన ఇంగ్లండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇంగ్లండ్ లోని నాటింగ్ హామ్ ప్రాంతంలో బిచ్చగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో భిక్షాటన చేస్తూ కనిపించేవారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో ఉద్యోగం చేసుకోవచ్చు కదా? అంటూ జడ్జి క్రేగ్ ను ప్రశ్నించగా, దానికి సమాధానమిస్తూ, తనకు ఇద్దరు పిల్లలని, వారిని చదివించుకునేందుకు భిక్షాటన చేస్తున్నానని సమాధానమిచ్చాడు. తనకు డ్రగ్స్ వంటి అలవాట్లు లేనందున సంపాదనలో అధికభాగం వారి విద్యకే ఖర్చు చేస్తున్నానని ఆయన తెలిపాడు. ఉద్యోగం చేస్తే వచ్చే సంపాదన కంటే భిక్షాటన ద్వారా వచ్చే సంపాదన ఎక్కువని ఆయన జడ్జికి తెలిపారు. దీంతో అవాక్కైన జడ్జి, భిక్షాటన మానేసి ఆరు నెలల్లో ఉద్యోగం వెతుక్కోవాలని సూచిస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ 15 పౌండ్ల జరిమానా విధించారు. ఆ జరిమానాను వెంటనే చెల్లించేందుకు క్రేగ్ సిద్ధపడడంతో ప్రాసిక్యూషన్ ఛార్జీ కింద 85 పౌండ్లు చెల్లించమని ఆదేశించారు. దీంతో అంత చెల్లించే స్తోమత తనకు లేదని, తనను జైలుకే పంపాలని ఆయన జడ్జికి విన్నవించుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News