: కపూర్ వంశం ఎలాంటిదో అందరికీ తెలుసు...అతనే థర్డ్ క్లాస్ మనిషి: రణధీర్ కపూర్


కపూర్ వంశం ఎలాంటిదో అందరికీ తెలుసని నిన్నటితరం బాలీవుడ్ నటుడు రణధీర్ కపూర్ అన్నారు. తన అల్లుడు, కరిష్మా కపూర్ భర్త సంజయ్ కపూర్ పై ఆయన నిప్పులు చెరిగారు. సంజయ్ కపూర్ లాంటివాడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని అసలు తాను భావించలేదని ఆయన తెలిపారు. సంజయ్ థర్డ్ క్లాస్ మనిషని ఆయన చెప్పారు. కపూర్ వంశానికి ప్రతిభకు, డబ్బుకు కొదవలేదని ఆయన అన్నారు. సంజయ్ కపూర్ ఎలాంటి వాడో ఢిల్లీలో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. భార్యను పట్టించుకోకుండా పరాయి స్త్రీతో సహజీవనం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కాగా, కరిష్మా కపూర్ కేవలం డబ్బు కోసమే తనను వివాహం చేసుకుందని, పిల్లలను పట్టించుకోదని ఆరోపిస్తూ బాంద్రా కోర్టులో సంజయ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News