: ప్రేమజంటను చెట్టుకు కట్టేసి హింసించిన ప్రియురాలి బంధువులు!


తాలిబాన్ల చర్యలను గుర్తుకుతెచ్చేలా ఓ ప్రేమ జంటను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బన్స్ వారా జిల్లాలో, లోహారియా పోలీసుస్టేషన్ పరిధిలోని ఉంబాడా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 20 సంవత్సరాల యువకుడు, తన ప్రియురాలితో కలసి తిరుగుతుండటాన్ని యువతి బంధువులు చూశారు. ఆపై వారిద్దరినీ ఓ చెట్టుకు బంధించి రెండు గంటలకు పైగా హింసించారు. ఆ తరువాత యువకుడి బంధువులకు విషయం తెలియగా, వారు వచ్చి అతన్ని విడిపించుకుని తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టి దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News