: ఒక్క అమ్మాయి అయినా అలా మారిందా?... అంతా మోసం: రాందేవ్ బాబా
అందం పెరుగుతుందని చెబుతూ, ఎఫ్ఎంసీజీ కంపెనీలు విక్రయిస్తున్న ఫెయిర్ నెస్ క్రీములపై యోగా గురువు బాబా రాందేవ్ విరుచుకుపడ్డారు. మంచి రంగుతో ఆకర్షణీయంగా ఉండే అమ్మాయిలను మోడల్స్ గా ఎంచుకుని తొలుత వారిని రంగు తక్కువగా మేకప్ వేసి చూపే కంపెనీలు, తమ ఉత్పత్తుల తరువాత వారు మరింత అందంగా మారుతున్నారని ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వీరు తమ మోసపు ప్రకటనలతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. తాను ప్రపంచమంతా తిరిగానని, ఫెయిర్ నెస్ క్రీములు వాడి తెల్లబడ్డ ఒక్క యువతి కూడా తనకు కనిపించలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాము 'పతంజలి' బ్రాండ్ పేరిట మార్కెట్లోకి తెచ్చిన ఉత్పత్తులన్నీ ఆయుర్వేద ఉత్పత్తులేనని చెప్పిన ఆయన, త్వరలో మ్యాగీని దాటేలా స్వదేశీ నూడుల్స్ అమ్మకాలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.