: పెట్రోలు రూ. 19, డీజెల్ రూ. 15 ఉండాలి... పైసా తగ్గించి రూపాయి వడ్డిస్తున్న కేంద్రం: కాంగ్రెస్ నిప్పులు


అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల లెక్కల ప్రకారం, ఇండియాలో లీటరు పెట్రోలు రూ. 19.40, డీజిల్‌ రూ. 15.71 ఉండాలని, కానీ, అందుకు మూడు రెట్లు అధికంగా ప్రజల జేబులను మోదీ సర్కారు గుల్ల చేస్తున్నదని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. రూ. 19 తీసుకోవాల్సిన చోట రూ. 59, రూ. 15 తీసుకోవాల్సిన చోట రూ. 44 వసూలు చేయడం ఏ మాత్రం భావ్యమని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌ దీప్‌ సుర్జేవాలా ప్రశ్నించారు. ఢిల్లీలో పెట్రో ఉత్పత్తుల రేట్లను ఉదహరించిన ఆయన, చాలా రాష్ట్రాల్లో అంతకన్నా ఎక్కువగా చెల్లిస్తూ ప్రజలు పెట్రోలు, డీజిల్ లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మే 26, 2014తో పోలిస్తే క్రూడాయిల్ ధరలు 72 శాతానికి పైగా తగ్గాయని గుర్తు చేసిన ఆయన, చమురు సంస్థలు ధరలను పైసల రూపంలో తగ్గిస్తుంటే, ప్రభుత్వం రూపాయల్లో పన్నులను పెంచుకుంటూ పోతున్నదని, దీంతో సామాన్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News