: చివర్లో ధోనీ మెరుపులు... ఆస్ట్రేలియా విజయలక్ష్యం 296


విరాట్ కోహ్లీ వీరోచిత శతకం, ఓపెనర్ ధవన్, మిడిల్ ఆర్డర్ లో రహానేల సమయోచిత బ్యాటింగ్, చివర్లో కెప్టెన్ ధోనీ మెరుపుల సాయంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. దీంతో మూడవ వన్డేలో ఆస్ట్రేలియా ముందు 296 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఉంచినట్లయింది. భారత జట్టులో రోహిత్ శర్మ 6, శిఖర్ ధవన్ 68, కోహ్లీ 117, రహానే 50, గురు కీరత్ సింగ్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 23 పరుగులు చేసిన ధోనీ హాస్టింగ్స్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి ఆరవ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. జడేజా 6, రిషి ధవన్ 3 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాస్టింగ్స్ 4, రిచర్డ్ సన్ం ఫాల్కనర్లకు చెరొక వికెట్ దక్కాయి. 296 పరుగుల విజయ లక్ష్యంతో మరికాసేపట్లో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. అయితే, ఇప్పటికే రెండు సార్లు 300కు పైగా స్కోర్లను విజయవంతంగా అందుకున్న ఆస్ట్రేలియా నేడు ఎలా ఆడుతుందో మరికాసేపట్లో తేలిపోతుంది.

  • Loading...

More Telugu News