: కేజ్రీవాల్ కోసం నితీష్ కుమార్ త్యాగం!


త్వరలో పంజాబ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయానికి మార్గాన్ని మరింత సుగమం చేసేందుకు జనతాదళ్ (యు) అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏ స్థానంలోనూ తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపకూడదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ లు మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం నవంబరులో జరిగిన బీహార్ ఎన్నికల్లో కేజ్రీవాల్ స్వయంగా జనతాదళ్ (యు)కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. "పంజాబ్ లో కాంగ్రెస్ కు, ఆప్ కు మధ్య మాత్రమే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నాం. జనతాదళ్ రంగంలోకి దిగితే, ఓట్లు చీలి ఆప్ విజయావకాశాలపై ప్రభావం పడవచ్చు. సుపరిపాలన, అభివృద్ధి కోసం యత్నించే మా పార్టీ అందుకు వ్యతిరేకం" అని జేడీయూ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని దూరం చేసేందుకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండాలని భావిస్తున్నాం అని ఆయన వివరించారు. కాగా, పంజాబ్ లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు కాంగ్రెస్, ఆప్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

  • Loading...

More Telugu News