: ప్రకాశం జిల్లాలో పేలిన బాంబులు!


నాటుబాంబులు పేలి ఇద్దరు తీవ్రగాయాల పాలైన ఘటన ఈ ఉదయం ప్రకాశం జిల్లా పరిధిలోని బచ్చువారిపాలెం గ్రామంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గ్రామంలోని పోలేరమ్మ దేవాలయం వద్ద ఈ ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. ఆపై కాసేపటికి పాపబోయిన శ్రీనివాసులు (30), వెంకటేశ్వర్లు అనే ఇద్దరు బాంబులు పేలిన ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా, తెల్లగా ఉన్న ఓ వస్తువు కనిపించింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని పరిశీలిస్తుండగా, అది పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం చీరాల ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పేలినవి నాటు బాంబులని, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News