: నరసరావుపేట ఎమ్మెల్యేపై కేసు
ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ నెల 11న రిమిరెడ్డి పాలెం గ్రామస్తులు చేసిన ధర్నాకు గోపిరెడ్డి మద్దతు పలికారు. తమ భూముల్లో రహదారులు నిర్మిస్తున్నారంటూ, రైతులు నరసరావుపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చి మద్దతు పలికి కాసేపు నిరసనలో పాల్గొన్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై కేసు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దీన్ని చట్టపరంగానే ఎదుర్కొంటానని గోపిరెడ్డి వ్యాఖ్యానించారు.