: వేగం పెంచిన కోహ్లీ, ధవన్... హాఫ్ సెంచరీలు
18వ ఓవర్ వరకూ నిదానంగా సాగుతూ వచ్చిన ఆట, ఆపై విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్ ల దూకుడుతో వేగం పెంచుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. 83 బంతులాడిన ధవన్ 7 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేయగా, 56 బంతులాడిన కోహ్లీ 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశారు. వీరిద్దరూ తమ బ్యాటింగ్ వేగాన్ని పెంచడంతో ఐదు ఓవర్ల వ్యవధిలో 31 పరుగులు భారత ఖాతాలో వచ్చి చేరాయి. ప్రస్తుతం భారత స్కోరు 25 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 119 పరుగులు.