: నిలకడగా సాగుతున్న ధవన్, కోహ్లీ!
మెల్ బోర్న్ లో జరుగుతున్న కీలకమైన మూడవ వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ అయినప్పటికీ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ లు నిదానంగా ఆడుతూ, స్కోరును ముందుకు తీసుకెళ్తున్నారు. ధావన్ నెమ్మదిగా ఆడుతూ 61 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేయగా, కోహ్లీ కాస్తంత దూకుడు ప్రదర్శిస్తూ, 36 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత స్కోరు 18 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులు. వీరిద్దరూ క్రీజులో ఎంత సేపు నిలుస్తారన్న విషయంపైనే భారత స్కోరు ఆధారపడి వుంది.