: 2 వేల మందితో కదిలిన 'ఆనం' రైలు!
నేటి మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం దాదాపు 2 వేల మంది కార్యకర్తలతో నెల్లూరు నుంచి ప్రత్యేక రైలులో ఆనం రాంనారాయణ, ఆనం వివేకానందలు విజయవాడకు బయలుదేరారు. విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్ వేదికగా తెలుగుదేశం బహిరంగ సభ జరుగనుండగా, ఆనం సోదరులకు చంద్రబాబు స్వయంగా పచ్చ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాగా, ఆనం సోదరుల రాకను పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, వారిని చేర్చుకునేందుకే చంద్రబాబు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే.