: హైడ్రామా మధ్య మిధున్ రెడ్డి అరెస్ట్ ఎలాగంటే..!


వైకాపా ఎంపీ మిధున్ రెడ్డిని తాము అరెస్ట్ చేయలేదని చిత్తూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. రేణిగుంటలో ఎయిర్ ఇండియా మేనేజరుపై దాడి చేసిన కేసులో తాము లుకౌట్ నోటీసులను జారీ చేశామని తెలిపారు. వాటి కారణంగా చెన్నై ఎయిర్ పోర్టులో కనిపించిన మిధున్ రెడ్డిని, అక్కడి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయని, ఆపై తిరుపతి పోలీసులకు అప్పగించారని వివరించారు. మిధున్ రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి సైతం విమానాశ్రయంలో పట్టుబడ్డారని, వీరిద్దరినీ కేసు నమోదైన శ్రీకాళహస్తికి తీసుకువచ్చి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని తెలిపారు. కాగా, మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో కాసేపట్లో నెల్లూరు సబ్ జైలుకు నిందితులను తరలించే ఏర్పాట్లలో పోలీసులు ఉన్నారు.

  • Loading...

More Telugu News