: గుడిలోకి బూట్లతో... సల్మాన్, షారూఖ్ లపై కేసు!
బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్, షారూఖ్ లకు మరో కష్టం వచ్చి పడింది. ఓ టీవీ షో కోసం ఆలయంలోకి వీరిద్దరూ బూట్లతో వెళ్లారని హిందూ మహాసభ వేసిన పిిటిషన్ ను విచారణకు స్వీకరించాలని మీరట్ కోర్టు నిర్ణయించింది. వీరిద్దరిపై కేసు పెట్టి విచారణ జరపాలని ఆదేశించింది. ఇండియాలో ఏ ప్రార్థనా మందిరానికి వెళ్లాలన్నా, పాదరక్షలు విడిచి వెళ్లాల్సిందేనని, సల్మాన్, షారూఖ్ లు సైతం అందుకు అతీతులు కాదని హిందూ మహాసభ అధ్యక్షుడు భరత్ రాజ్ పుత్ వ్యాఖ్యానించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా షూటింగును జరిపారని, సదరు టీవీ చానల్ కు వారి బూట్లను చూపవద్దని కోరినా, వారు వినలేదని ఆరోపించారు. అందువల్లే తాము కోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని, పార్లమెంటులో ప్రస్తావనకు తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.