: ఇదో అద్భుతం...రెండో అంతస్తు నుంచి కిందపడిన చిన్నారి... చిన్న గాయం కూడా కాలేదు!


రెండంతస్తుల మేడపై నుంచి కిందపడినా ఆ పాపకు చిన్న గాయం కూడా కాలేదు. ఆ వివరాల్లోకి వెళ్తే... బ్రెజిల్ లోని ఫొర్టలెజాలోని ఓ అపార్ట్ మెంట్ నుంచి 14 నెలల బాలిక కిందపడింది. దీనిని చూసిన ట్యాక్సీ డ్రైవర్ ఆందోళనతో అక్కడికి చేరుకునేసరికే, కిందపడ్డ పాప లేచి ఏడుస్తూ కూర్చొంది. ఇంతలో ఈ ఘటనను చూసిన మరో మహిళ పరుగున వచ్చి పాపను అక్కున చేర్చుకుంది. కాసేపటికి తల్లి వచ్చి పాపను ఆమె నుంచి తీసుకుని గుండెలకు హత్తుకుంది. దీంతో ఆమె అందరికీ వివరణ ఇస్తూ...కిటికీ పక్కనే మంచంపై పాప పడుకుందని తెలిపింది. మెలకువ వచ్చిన పాప కిటికీకి గ్రిల్ లేకపోవడంతో అందులోంచి కిందపడిందని ఆమె చెప్పింది. పాప కిందపడేటప్పుడు నేరుగా నేలపై పడలేదని, టెలిఫోన్ వైర్లపై పడిందని, అక్కడ్నుంచి కిందపడడం వల్ల పాపకు ఏమీ కాలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంత ఎత్తు నుంచి కిందపడ్డా పాపకు ఏమీ కాకపోవడం అద్భుతమేనని వారంతా పేర్కొంటున్నారు. ఈ పుటేజ్ సోషల్ మీడియాలో నెటిజన్లలో ఆసక్తి రేపుతోంది.

  • Loading...

More Telugu News