: ఓటింగ్ ను సులభతరం చేస్తాం: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
ఓటింగ్ ను మరింత సులభతరం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తామని అన్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో అవినీతి అధికంగా ఉందని చెప్పిన ఆయన, దానిని కట్టడి చేయాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓటింగ్ ను మరింత సులభతరం చేస్తామని, ఓటర్లు తికమకపడకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.