: బీజేపీ ఒప్పుకుంటే జీఎస్టీ బిల్లును 15 నిమిషాల్లో ఆమోదిస్తాం: రాహుల్ గాంధీ
తమ డిమాండ్లకు బీజేపీ అంగీకరిస్తే కేవలం 15 నిమిషాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ముంబైలో ధారవి ప్రాంతంలోని చిన్న సంస్థల వ్యాపారులతో ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రయోజన డిమాండ్లు అంగీకరించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు. అందుకే జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం లేదని ఆయన స్పష్టం చేశారు. రైతులు, బడుగు, బలహీన వర్గాలను మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. చిన్న వ్యాపారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ తెలిపారు.