: 'హనీ ట్రాప్'లో పడింది కింది స్థాయి ఉద్యోగులే: పారికర్


పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు, నిఘా సంస్థలు వేసిన 'హనీ ట్రాప్' (అమ్మాయిలు తీయగా మత్తుగా మాట్లాడుతూ పురుషులను ముగ్గులోకి దించి, రహస్యాలు రాబట్టడానికి వేసే వల)లో ఉన్నత స్థాయి ఉద్యోగులెవరూ లేరని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. జైపూర్ లోని సీఐఎస్ఎఫ్ గ్రౌండ్స్ లో జరిగే ఆర్మీ ర్యాలీ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ యువకులకు దేశభక్తి ఎక్కువని అన్నారు. అందుకే ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపుతారని ఆయన పేర్కొన్నారు. రక్షణ రంగ ఉద్యోగులు ఉగ్రవాద సంస్థల ఉచ్చులో పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి సందర్భంగా హనీ ట్రాప్ అంశం వెలుగు చూడడం వాస్తవమేనని చెప్పిన ఆయన, ఇందులో ఉన్నత స్థాయి అధికారులు లేరని తేల్చి చెప్పారు. వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే ప్రత్యర్థులు హనీ ట్రాప్ లాంటి పాచికలు వేస్తారని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News