: అశ్లీల నృత్యాలను అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి... ముగ్గురు ఖాకీలకు గాయాలు


సంక్రాంతి సంబరాల పేరుతో యువత వెర్రి వేషాలేస్తోంది. కట్టు తప్పవద్దని వారించినా ఫలితం కనిపించడం లేదు. కోర్టులు వద్దన్నా కోడి పందాలు, జల్లికట్టు జోరుగా సాగుతున్నాయి. దీనికి తోడు అశ్లీల నృత్యాలు కూడా హోరెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రభల తీర్థం వద్ద నిన్న రాత్రి కొంతమంది యువకులు అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అశ్లీల నృత్యాలను నిలువరించేందుకు యత్నించారు. అయితే అప్పటికే ఫుల్ జోష్ లో ఉన్న యువత పోలీసులపై విరుచుకుపడింది. రాళ్లు చేతబట్టి పోలీసులను తరిమింది. ఈ క్రమంలో కొందరు యువకులు విసిరిన రాళ్లు తగిలిన కారణంగా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News