: భారత్ ను ప్రసన్నం చేసుకునేందుకే అజార్ నిర్బంధం: పాక్ పై సయీద్ ఆరోపణ


పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడికి సూత్రధారిగా వ్యవహరించిన జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ నిర్బంధంపై మరో ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీస్ సయీద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అజార్ ను పాకిస్థాన్ ప్రభుత్వం నిర్బంధించడం సరికాదని కూడా అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ ను ప్రసన్నం చేసుకునేందుకే నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అజార్ ను నిర్బంధిస్తోందని కూడా అతడు ఆరోపించాడు. భారత్ వాదనతో అజార్ ను అరెస్ట్ చేయడం ద్వారా పాక్ పై మరింత మేర ఒత్తిడి పెరగనుందన్న విషయం నవాజ్ షరీఫ్ కు అర్థం కావడం లేదని అతడు వ్యాఖ్యానించాడు. నిన్న జమాత్ ఉద్ దవా ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన సందర్భంగా సయీద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News