: కాశ్మీర్ అంశంపై పాక్ లో చర్చ... హాజరవుతానంటున్న స్వతంత్ర ఎమ్మెల్యే


పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో అక్కడి స్థానిక ప్రభుత్వ ఆధ్వర్యంలో కాశ్మీర్ అంశంపై జరగనున్న చర్చకు హాజరుకావాలని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందింది. కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ కీలక నేతలతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న ఇంజినీర్ రషీద్ (స్వతంత్ర), మొహమ్మద్ యూసుఫ్ తరిగమి (సీపీఎం)లకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ మేరకు పీవోకే అధ్యక్షుడు సర్దార్ ముహమ్మద్ యాకూబ్ ఖాన్ పేరిట వచ్చిన ఆహ్వానాలు ఇద్దరు ఎమ్మెల్యేలకు చేరాయి. ఈ నెల 20, 21 తేదీల్లో జరగనున్న సదరు సమావేశానికి హురియత్ నేతలు హాజరుకానున్నారు. వీరితో పాటు స్వతంత్ర ఎమ్మెల్యే రషీద్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. సమావేశానికి రషీద్ హాజరవుతారని ఆయన ప్రతినిధి ఒకరు నిన్న తెలిపారు. అయితే సదరు సమావేశానికి సీపీఎం ఎమ్మెల్యే మాత్రం హాజరు కావడం లేదు.

  • Loading...

More Telugu News