: ఈ రాజుగారి బిల్లుతో విద్యుత్ సంస్థ నష్టాల నుండి గట్టెక్కుతుందట


రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. అయితే నేపాల్ లో మాత్రం ఆ మాజీ రాజుగారు ఏమీ తలచుకోరేమో... ఆయనగారు ఎవరినీ కొట్టక్కర్లేదు కానీ.. బకాయి పడిన విద్యుత్ బిల్లు కట్టాలి. నేపాల్ దేశానికి చెందిన మాజీ రాజు జ్ఞానేంద్ర.. నేపాల్ ఎలక్ట్రిసిటీ సంస్థకు (ఎన్‌ఈఏ) అక్షరాలా 70,000 అమెరికన్ డాలర్లు బకాయిపడ్డారు. ఆయన నివసిస్తున్న ప్యాలెస్ కు అధికారులు విద్యుత్ బిల్లు పంపగా, దానిని చెల్లించేందుకు ఆయన నిరాకరించారట. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన నేపాల్ విద్యుత్ సంస్థ వీటినుండి బయటపడాలంటే మాజీ రాజుగారి బిల్లుపైనే ఆశలు పెట్టకున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం వారు నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించనున్నారు.

  • Loading...

More Telugu News