: మా మంత్రులపైనా సోదాలు చేస్తారట... అయినా తమకేమీ కాదంటున్న కేజ్రీ!


ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తన కార్యాలయంలోని ఓ అధికారిపై సీబీఐ అధికారుల చేత సోదాలు చేయించిన నరేంద్ర మోదీ సర్కారు... తాజాగా తన కేబినెట్ లోని కీలక మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కార్యాలయాలపైనా సోదాలకు రంగం సిద్ధం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు తమకు తెలిసిందని కేజ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కారు ఎంతదాకా వెళ్లినా తమకేమీ జరగదని కూడా కేజ్రీ ధీమా వ్యక్తం చేశారు. దేవుడు తమ పక్షానే ఉన్నాడని పేర్కొన్న కేజ్రీ... తమపై మోదీ సర్కారు చేసే కుట్రలన్నీ సఫలం కావని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News