: కేంద్రంలో ఉన్నది భాయ్ సర్కార్ ..ఇక రామమందిరం చింత ఎందుకు?: ప్రవీణ్ తొగాడియా
ఢిల్లీలో భాయ్(మోదీ) సర్కారు ఉండగా, ఇక అయెధ్యలో రామమందిన నిర్మాణం గురించి చింతించాల్సిన అవసరం లేదని వీహెచ్ పీీ సిీనియర్ నేత ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. అక్కడ మన సర్కారే ఉన్నప్పుడు ఆందోళనలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. రామమందిర నిర్మాణం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. 'సర్దార్ పటేల్ పార్లమెంట్ లో చట్టం తీసుకువచ్చి సోమనాథ్ మందిరం కట్టించారు. అలాగే మోదీ కూడా పార్లమెంటు ఇరు సభల్లో చర్చించి మందిర నిర్మాణం కోసం చట్టం తీసుకురావాల'న్నారు.