: క్షమాపణ కోరిన కాంగ్రెస్ దర్శన్ సంపాదకుడు... సరేనన్న రాహుల్
ముంబై పర్యటనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ దర్శన్ సంపాదకుడు సంజయ్ నిరుపమ్ ను క్షమించేశారు. పైగా అతని పనితీరును మెచ్చుకున్నారు. ఇక ఇప్పటితో కాంగ్రెస్ దర్శన్ వివాదం సమసిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. రాహుల్ ముంబై పర్యటన సందర్భంగా సంజయ్ నిరుపమ్ ఆయనను కలుసుకుని క్షమాపణలు కోరినట్టు తెలిసింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ మనమంతా తప్పులు చేస్తుంటాం. అయితే తప్పులు చేసేవారి తప్పులను గుర్తించడంతో పాటు వారి ఉద్దేశాన్ని కూడా గుర్తించాలన్నారు.