: మీకు మీ నాన్న స్ఫూర్తి అయితే, నాకు మా నాన్న: అఖిల్, చైతూలతో నాగార్జున


'మీకు మీ నాన్న ఇన్ స్పిరేషన్ అయితే, నాకు మా నాన్న ఇన్ స్పిరేషన్' అని టాలీవుడ్ స్టార్ నాగార్జున అన్నారు. 'సోగ్గాడే చిన్ని నాయన' ప్రమోషన్ సందర్భంగా వీరు ముగ్గురూ సినిమా గురించి మాట్లాడారు. నాగార్జున మాట్లాడుతూ, సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పారు. ఈ సినిమాలో 'బంగార్రాజు' కేరక్టర్ తనకు బాగా నచ్చిందని అఖిల్, నాగచైతన్య చెప్పారు. చాలా కాలం తరువాత రమ్యకృష్ణతో నాగార్జున నటించారని, మరోసారి వీరి జంట కన్నుల పండుగగా తెరపై కన్పించిందని వారు పేర్కొన్నారు. ఈ పాత్రకు స్ఫూర్తి 'దసరాబుల్లోడు' సినిమా అని నాగార్జున చెప్పారు. ఆయనలా పంచెకట్టి నటించాలని కోరిక బలంగా ఉండేదని, 'అల్లరి అల్లుడు'లో నటించినప్పటికీ ఇలాంటి పంచె మాత్రం కట్టలేదని నాగార్జున తెలిపారు. 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం' సినిమాలో 'దసరాబుల్లోడు' సినిమా పంచెకట్టుకట్టానని, ఈ సినిమాలో కనిపించినది మాత్రం తన తండ్రి సాధారణంగా ఇంట్లో కట్టే పంచెకట్టు అని నాగార్జున అన్నారు.

  • Loading...

More Telugu News