: సెంచరీ ఆనందం కంటే ఓటమి భారమే ఎక్కువ: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో వరుసగా రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలవ్వడం తనను బాధించిందని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ, మ్యాచ్ లో తన ప్రదర్శన తృప్తినిచ్చిందని అన్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తనను వరించడం ఆనందం కలిగించినప్పటికీ, మ్యాచ్ లో ఓటమి మరింత బాధించిందని చెప్పాడు. గెలుపే లక్ష్యంగా ఆడుతున్నప్పటికీ ఓటమిపాలవ్వడం జట్టుకు కష్టంగా ఉంటుందని రోహిత్ తెలిపాడు. తరువాతి మ్యాచ్ లో విజయం సాధించాల్సిందేనని రోహిత్ చెప్పాడు.